రెక్లెస్ డ్రైవింగ్: ఆసియా ట్రక్కర్‌కి రెండు నెలల జైలు
- September 16, 2019
బహ్రెయిన్: ఆసియాకి చెందిన ట్రక్ డ్రైవర్ ఒకరికి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకుగాను 2 నెలల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇస్తిక్లాల్ హైవేపై సనద్ వద్ద ప్రమాదకరంగా నిందితుడు వాహనాన్ని నడిపినట్లు అభియోగాలు నిరూపించబడ్డాయి. ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ చీఫ్ ప్రాసిక్యూటర్ హుస్సేన్ అల్ సైరాఫి మాట్లాడుతూ, నిర్దేశిత స్పీడ్ లిమిట్‌ని మించి అతి ప్రమాదకరంగా నిందితుడు వాహనాన్ని నడిపాడని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేయడంతో, నిందితుడ్ని పట్టుకుని విచారణ జరిపారు. ఎమర్జన్సీ లేన్‌ని వినియోగిస్తూ ఇతర వాహనాల్ని ప్రమాదకరంగా దాటుకుని ముందుకు వెళ్ళినట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!