ఉత్తమ నటిగా అలియా, ఉత్తమ నటుడిగా రణ్వీర్
- September 19, 2019ముంబయి: గత రాత్రి ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ) అవార్డ్స్ ఘనంగా జరిగాయి. బాలీవుడ్ ప్రముఖ తారలంతా ఈ వేడుకకి హాజరు కాగా, కార్యక్రమం సందడిగా జరిగింది. రాజీ చిత్రానికి గాను అలియా భట్ ఉత్తమ నటి అవార్డు అందుకోగా, పద్మావత్‌లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రని అద్భుతంగా పోషించిన రణ్వీర్ సింగ్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా రాజీ ఎంపికైంది. ఉత్తమ డైరెక్టర్‌గా శ్రీ రామ్ రాఘవన్ అవార్డు అందుకున్నారు. విక్కీ కౌశల్, అదితిరావు హైదరి బెస్ట్ సపోర్టింగ్ రోల్‌కి గాను అవార్డు తీసుకున్నారు.ఐఫా అవార్డుల వేడుక కార్యక్రమం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీపికా పదుకొణేకి స్పెషల్ అవార్డ్ ఇచ్చారు. బర్ఫీ చిత్రానికి గాను రణబీర్ కపూర్ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు. ఇక స్పెషల్ అవార్డ్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడు అవార్డు రాజ్ కుమార్ హిరాణీకి దక్కింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!