ఈ 'స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్’ వేస్తే దోమలు పరార్..
- September 20, 2019
ఇండియా:హాయిగా ఆదమరచి నిద్రపోదామంటే అంతలోనే తలుపులన్నీ బిగించి ఉన్నా.. నేనొచ్చేసా అంటూ చెవిలో దోమ గుయ్ మంటూ నిద్ర లేపేస్తుంది. పాడుదోమలు పడుకోనివ్వట్లేదని బ్యాట్ పట్టుకుంటే ఓ పట్టాన దొరక్కుండా నిద్ర చెడగొట్టేస్తుంది. రోజూ ఇదే తంతు. ఒక్కరోజైనా హాయిగా నిద్ర పోవడానికి లేదు. ఏ దోమ కుడితే ఏ జ్వరం వస్తుందో అని అదో భయం. దోమల రిఫెల్లెంట్స్, దోమల బ్యాటులు.. ఆయుధాలు ఎన్ని ఉన్నా దోమలు కుట్టకుండా నిద్రపోవడం అనేది సాధ్యం కాని పని. అయితే ఫ్యాన్ తిరిగితే చాలు దోమలు మీ దరిదాపుల్లోకి రావు.. హాయిగా నిద్రపోవచ్చని అంటున్నారు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ వారు.
ఇండియాలో ఈ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్‌ని రిలీజ్ చేసింది సంస్థ. దీనికి వైఫై సపోర్టు కూడా ఉంది. డ్యూయెల్ వింగ్ ఫ్యాన్ బ్లేడ్స్ ఉండడంతో గది మొత్తం గాలి వీస్తుందని చెబుతోంది. ఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా ఉన్న ఫ్యాన్ ధర వచ్చి రూ.16,999. అడ్వాన్స్‌డ్ ఇన్వర్టర్ మోటార్ ఉండడంతో భద్రతతో పాటు మన్నిక కూడా ఎక్కువని అంటోంది. అన్నిటికంటే సంతోష పెట్టే వార్త.. ఈ సీలింగ్ ఫ్యాన్‌లో మస్కిటో అవే టెక్నాలజీ ఉండడం. ఇందులో ఉన్న అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్ టెక్నాలజీతో దోమలు మీ దరిదాపుల్లోకి కూడా రావని అంటున్నారు. వైఫై సదుపాయం ఉండడంతో అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!