హ్యూస్టన్‌:భారీ వర్షం కారణంగా 'హౌడీ-మోదీ' సభ రద్దు అయ్యే అవకాశం

- September 20, 2019 , by Maagulf
హ్యూస్టన్‌:భారీ వర్షం కారణంగా 'హౌడీ-మోదీ' సభ రద్దు అయ్యే అవకాశం

అమెరికా:ఈ నెల 22న 'హౌడీ-మోదీ' పేరుతో టెక్సాస్‌లో నిర్వహిస్తున్న భారీ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి 50వేలకు పైగా ఎన్నారైలు హాజరవుతారని నిర్వాహకుల అంచనా. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ట్రంప్ కూడా హాజరవుతుండడంతో ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొనటానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇదిలా ఉంటే ఉష్ణమండల తుఫాను వల్ల టెక్సాస్‌లో గురువారం నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో వరద నీరు పొటెత్తడంతో పూర్తిగా జలమయమైనట్లు సమాచారం. దీంతో టెక్సాస్‌లోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ జార్జ్ అబ్బాట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆగ్నేయ టెక్సాస్‌లోని 13 కౌంటీల్లో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు 'హౌడీ-మోదీ' సభకు ఆటంకంగా మారే అవకాశం ఉందని నిర్వాహకులు భయపడుతున్నారు. దాదాపు 1,500 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారని ప్రధాన నిర్వాహకుడు అచలేష్ అమర్ పేర్కొన్నారు. హ్యూస్టన్‌లో భారీ వర్షాల నేపథ్యంలో తాము గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com