యూఏఈలో గోల్డ్ కార్డ్ పొందిన డా.జులేఖా దౌద్
- September 20, 2019
దుబాయ్: యూఏఈ తదితర దేశాల్లో శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు ఇచ్చే గోల్డ్‌కార్డును తొలిసారిగా ఓ భారతీయ మహిళ పొందారు.జులేఖా దౌద్(81) మహారాష్ట్ర లోని నాగపూర్ కి చెందిన వారు.జులేఖా దౌద్ యూఏఈ లో డాక్టర్ గా వృత్తి ప్రారంభించి జులేఖా హాస్పిటల్ని స్థాపించారు.ఈ గోల్డ్‌కార్డుల విధానాన్ని అమలు చేయడం మొదలెట్టగానే.. తొలి గోల్డ్‌కార్డును దుబాయ్ లో వ్యాపారం చేస్తున్న భారత వ్యాపారవేత్తకే ఇచ్చారు. ఇప్పడు కూడా జులేఖా దౌద్ అనే ఓ డాక్టరుకు ఈ కార్డు అందజేశారు. వైద్యరంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం గోల్డ్‌కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. శాశ్వత పౌరసత్వం పొందిన విదేశీయులకు అమెరికా గ్రీన్‌కార్డులు ఇస్తుందని తెలిసిందే. ఈ తరహాలోనే తమ దేశంలోని వలసదారులకు కూడా ఇక్కడ శాశ్వత పౌరసత్వం పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని రూపొందించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..