ఢిల్లీ- విజయవాడ ఫ్లైట్‌ మీద పిడుగులు..

- September 22, 2019 , by Maagulf
ఢిల్లీ- విజయవాడ ఫ్లైట్‌ మీద పిడుగులు..

ఢిల్లీ- విజయవాడ ఎయిర్‌యిండియా ఫ్లైట్‌లో ప్రయాణికులకు క్షణకాలం గుండె ఆగినంత పనైంది. నిన్న రాత్రి 7:28కి ఢిల్లీలో బయలుదేరిన AI-467 విమానం.. దారిలో ఉరుములు, పిడుగుల ధాటికి భారీ కుదుపులకు గురైంది. టేకాఫ్ అయినప్పటి నుంచే వర్షం మొదలైంది. ఐతే.. దీన్ని ప్రతికూల వాతావరణంగా పరిగణించాల్సిన అవసరం లేదని భావించడంతో పైలట్ కూల్‌గా ఫ్లైట్ నడుపుతున్నారు. ఇంతలో ప్రచండ గాలులకు విమానం అటు ఇటు ఊగిపోయింది. భారీ పిడుగులు కూడా పడడంతో ఆ ప్రభావానికి ఫ్లైట్‌ షేకయిపోయింది. ఫుడ్ పార్శిళ్లు, వాటర్ బాటిళ్లు కింద పడిపోయాయి. లోపలున్న ప్రయాణికులకు ఓ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ సమయంలో విమానంలో 150 మంది ఉన్నారు. అదృష్టవశాత్తూ వీళ్లలో ఎవరికీ ఏమీ జరగలేదు. ఫ్లైట్ సిబ్బందిలో ఒకరిద్దరు స్వలంగా గాయపడ్డారు. చివరికి రాత్రి 9:40కి ఫ్లైట్ గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనపై ఎయిర్‌ఇండియా విచారణకు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com