సౌదీ రాజు ప్రత్యేక విమానంలో అమెరికాకు ఇమ్రాన్ ఖాన్!
- September 22, 2019
సౌదీ అరేబియా: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు చెందిన ప్రత్యేక విమానంలో శనివారం అమెరికాకు చేరుకున్నారు. మీరు మా ప్రత్యేక అతిథి.. మీరు మా ప్రత్యేక విమానంలో అమెరికాకు వెళ్లడం మాకు ఆనందంగా ఉందని ఇమ్రాన్‌ను ఉద్దేశించి సౌదీ రాజు వ్యాఖ్యానించారు.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను పాక్ విదేశాంగ మంత్రి షా మొహమూద్ ఖురేషీ వెల్లడించారు. శనివారం ఇమ్రాన్ ఖాన్ అమెరికా చేరుకున్నారని, వారం రోజులపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో కాశ్మీర్ అంశాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రస్తావిస్తారని చెప్పుకొచ్చారు.
కాశ్మీర్ అంశంపై మద్దతు ఇవ్వాలంటూ అమెరికా పర్యటన ముందు సౌదీ అరేబియాలో పర్యటించారు ఇమ్రాన్ ఖాన్. సౌదీ రాజు సల్మాన్ అబ్దులజీజ్ ఆల్ సౌద్ తో భేటీ అయ్యారు. కాశ్మీర్ అంశంతోపాటు పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలపై చర్చించుకున్నారు.
ఆ తర్వాత యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లారు. సెప్టెంబర్ 27న జరిగే సమావేశంలో ఇమ్రాన్ ప్రసంగించనున్నారు.మోడీ కూడా ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అభివృద్ధి, అంతర్జాతీయ శాంతి, భ్రదతల అంశాలను మోడీ ఈ సదస్సులో ప్రస్తావించనున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..