కలెక్టర్ కార్యాలయంలో పరిహారం కోసం క్యూ కట్టిన వడ్డే నవీన్.!
- September 24, 2019
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోల తనయుడు హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో దర్శక, నిర్మాత ఇతర టెక్నీషియన్, నటుల వారసులు కూడా వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే కోవలోకి వస్తారు వడ్డే నవీన్. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు వడ్డే నవీన్. 'కోరుకున్న ప్రియుడు' సినిమాతో హీరోగా పరిచయం అయిన నవీన్ ఎక్కువగా ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించాడు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు వడ్డే నవీన్
కోడీ రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి' వడ్డే నవీన్ కి బాగా పేరు తీసుకు వచ్చింది. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేక పోయాయి. సాధారణంగా హీరోగా నటించన వారికి సొసైటీలో ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. కానీ ఈ మద్య కొంత మంది హీరోలు ఎలాంటి డాంభికాలకు పోకుండా కామన్ మాన్ లా ఉంటు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా వడ్డే నవీన్ సామాన్యుడిలా క్యూ లైన్లో నిలబడి అధికారులను కలసుకున్న సంఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా కె.మాధవరంలో తమ భూమికి సంబంధించిన వ్యవహారంలో నవీన్ ప్రభుత్వానికి అర్జీ అందించారు. తమ 18 ఎకరాల భూమికి సంబంధించిన పరిహారం ఇప్పించాలని తన వినతిపత్రంలో కోరాడు. 1973లో భూసంస్కరణల్లో భాగంగా తమ మామిడి తోటను తీసుకున్నారని, అయితే ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదని వివరించారు. దీనికి సంబంధించిన అన్ని పత్రాలను ఆయన అధికారులకు చూపించారు. అంతకుముందు, తనవంతు వచ్చేవరకు సామాన్య ప్రజల్లో ఒకడిగా వడ్డే నవీన్ క్యూ లైన్లో నిలబడటం విశేషం.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!