జైపూర్-దుబాయ్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ.40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

- September 28, 2019 , by Maagulf
జైపూర్-దుబాయ్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ.40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు రూ. 40 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో మహ్మద్ షకిల్, మహ్మద్ రఫిక్ అనే ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వారి వద్ద ఉన్న వేర్వేరు బాక్సుల్లో భారీ మొత్తంలో అరబ్ దేశాల కరెన్సీలైన దినార్, రియాల్, దిర్హామ్స్ దొరికాయి. వాటి విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.నిందితులిద్దరిని విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎక్కుతుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com