అమెరికా పర్యటన ముగించుని ఢిల్లీ చేరిన మోదీ

- September 28, 2019 , by Maagulf
అమెరికా పర్యటన ముగించుని ఢిల్లీ చేరిన మోదీ

ఢిల్లీ:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 28 శనివారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీలోని పాలం టెక్నికల్ ఎయిర్ పోర్టు వద్ద ఆయనకు వేలాది ప్రజలు ఘన స్వాగతం పలికారు. హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ' నినాదాలు, సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో హోరెత్తించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై మోదీకి గజమాల వేసి స్వాగతం పలికారు.

అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయుల సమావేశాల్లో పాల్గొన్నారు. అక్కడి ఆయిల్ కంపెనీల ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యారు. ఆపై ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొని భారత వాణిని బలంగా వినిపించారు. ఈ సందర్బంగా మోదీ తన అమెరికా విశేషాలను అందరితో పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com