మలేషియా బాధితులను ఆదుకున్న APNRTS సంస్థ

- September 29, 2019 , by Maagulf
మలేషియా బాధితులను ఆదుకున్న APNRTS సంస్థ

విశాఖపట్నం: బతుకుదెరువు కోసం మలేషియా వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోస పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఏపీ నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ తిరిగి సొంత గ్రామాలకు తీసుకువస్తోంది. అనేక కారణాలతో మోసపోయిన 200 మందితో ఈ సంస్థ సంప్రదించింది. వీరిలో తొలి విడతగా 18 మందికి మలేషియా ప్రభుత్వానికి ఈ సంస్థ జరిమానా చెల్లించడమే కాకుండా విమాన టికెట్లు కొనుగోలు చేసింది. వీరంతా ఆదివారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి రానున్నారు. ఇక్కడ నుంచి వారి సొంత ఊళ్లకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశామని సంస్థ అధ్యక్షుడు వెంకట్‌ మేడపాటి తెలిపారు. ఎవరైనా సంప్రదించాలంటే 0863-2340678, 8500027678కు ఫోన్‌ చేయాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com