చమురు ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం..సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరిక
- September 30, 2019
ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత ముదిరితే చమురు ధరలు ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉందని సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హెచ్చరించారు. ''ఇరాన్ దూకుడును అడ్డుకునేలా ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలి. లేదంటే ఉద్రికత్తలు మరింత ముదిరి అంతర్జాతీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. చమురు సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. చమురు ధరలు జీవితకాల గరిష్ఠానికి చేరతాయి. ప్రపంచపు 30శాతం ఇంధన ఎగుమతులు, 20శాతం వాణిజ్య మార్గాలకు మిడిల్ ఈస్ట్ ప్రాంతం నెలవుగా ఉంది. ప్రపంచ జీడీపీలో నాలుగు శాతం ఇక్కడి నుంచే వస్తోంది. ఇవన్నీ ప్రభావితమవుతాయి. అంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది'' అని సీబీఎస్ అనే మీడియా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో సౌదీ యువరాజు హెచ్చరించారు.
సౌదీలోని అతిపెద్ద చమురు సంస్థ ఆరామ్కోకు చెందిన అబ్ఖైక్, ఖురైస్ శుద్ధి కేంద్రాలపై ఇరాన్‌తో సంబంధాలున్న హుతీ తిరుగుబాటుదారులు ఈ నెల ఆరంభంలో డ్రోన్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ చమురు ఎగుమతుల్లో దాదాపు ఆరు శాతం ప్రభావితమయ్యాయి. ఈ దాడికి ఇరాన్ ప్రభుత్వమే కారణమని అమెరికా, సౌదీ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే సైనిక చర్యకు తాను ఏమాత్రం ఇష్టపడడం లేదని మహ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. శాంతియుత చర్చలకు తానెప్పుడూ సిద్ధమేనన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!