రచ్చగా మారిన 'సైరా' ప్రి రిలీజ్‌

- September 30, 2019 , by Maagulf
రచ్చగా మారిన 'సైరా' ప్రి రిలీజ్‌

దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు ఎంతోమంది మహనీయులు పోరాడారని అటువంటి వారి చరిత్రతో సినిమా తీయాలనే కల సైరా నరసింహారె డ్డి ద్వారా తీరిందని కన్నడిగులు ఆశీర్వదించాలని మెగాస్టార్‌ చిరంజీవి కోరారు. సైరా నరసింహారెడ్డి ప్రిరిలీజ్‌ ఆదివారం రాత్రి బెంగళూరులోని మ్యాన్‌ఫో కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. చిరంజీవితోపాటు నిర్మాత, ఆయన తనయుడు రామ్‌చరణ్‌, హీరోయిన్‌ తమన్నా, దర్శకుడు సురేంద్రరెడ్డిలు పా ల్గొన్నారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ న ట వారసుడు శివరాజ్‌కుమార్‌ ప్రత్యేక ఆ హ్వానితుడిగా విచ్చేశారు. మెగాస్టార్‌ అంటే కన్నడిగులకు ఎనలేని అభిమానం. చిరంజీవి రాక తెలుసుకుని వేలాదిమంది అభిమానులు మధ్యాహ్నానికే కన్వెన్షన్‌ సెం టర్‌కు చేరుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆ సంఖ్య మరింత పెరిగింది. అభిమానులను ఉద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ కన్నడ అంటే నాకెంతో ఇష్టమని రాజ్‌కుమార్‌ మాకు ఓ తండ్రిలాంటివారని తమ్ము డు శివరాజ్‌తో కలసి వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమరయోధుడి పాత్రలో మరికొన్ని గంటల్లోనే మీముందుకు వస్తున్నా... కన్నడ భాషలోనే వీక్షించండి...

మీ అభిమానంతోనే ఇంతటి వాడయ్యానన్నారు. రెండున్నరేళ్ళు సినిమాకోసం కష్టపడ్డాం... రాజీ లేకుండా సినిమా తీశాం... భారీ బడ్జెట్‌ కావడంతో వెనుకాముందూ ఆలోచనే లేకుం డా నా కొడుకు రామ్‌చరణ్‌ నిర్మాతగా ముం దుకొచ్చారన్నారు.

రూ.300 కోట్లు బడ్జెట్‌ అంటే ఆషామాషీ కాదు. అయినా ప్రజలకు సమరయోధుడి సందేశం ఇస్తున్నాననే సంతోషంగా ఉన్నానన్నారు. కన్నడతోపాటు హిందీ, తమిళ్‌లో కూడా సినిమా విడుదల అవుతోందన్నారు. దేశంలోనే లెజెండ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఓ పాత్ర సరిపోతుందని ఒక్కఫోన్‌ కాల్‌తోనే కాల్‌షీట్‌లు ఇచ్చారన్నారు. సినిమాకోసం రెండున్నరేళ్ళు ఎంతోమంది కష్టపడ్డారు. మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు. తొలుత కన్నడలో మాట్లాడిన చిరంజీవి అందరినీ ఆకట్టుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com