యూఏఈలో కొనసాగనున్న హుమిడ్ వాతావరణం
- September 30, 2019
యూఏఈ వ్యాప్తంగా హ్యుమిడిటీతో కూడిన వాతావరణం కొనసాగనుంది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం వరకూ వాతావరణ పరిస్థితులు దాదాపుగా ఇలానే వుంటాయి. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ బాగా పెరుగుతుంది. ఉదయం సమయాల్లోనూ ఇది ఎక్కువగానే వుంటుంది. ఉష్ణోగ్రతలు 39 నుంచి 43 డిగ్రీల వరకు ఇంటీరియర్ రీజియన్స్‌లో వుంటాయి. కోస్ట్ ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు వుండొచ్చు. మౌంటెయిన్స్‌లో 25 నుంచి 31 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దుబాయ్‌లో అత్యధికంగా 39 డిగ్రీల వరకు, అబుదాబీలో 41 డిగ్రీల వరకు, సార్జాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. గాలుల వేగం సాధారణ స్థితిలోనే వుంటుంది. అత్యధికంగా గంటకు 38 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..