మార్కెట్ లో స్మార్ట్‌షర్టులు
- October 01, 2019
లండన్ : అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య సమస్యలను 'స్మార్ట్'గా గుర్తించేందుకు ఎన్నో పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. కాదేదీ అనుసంధానికి అనర్హం అన్నట్లు.. చేతికి పెట్టుకునే వాచ్ నుంచి వేసుకునే డ్రెస్ వరకు మనకు సంబంధించిన ప్రతీ వస్తువుతో మొబైల్‌ను అనుసంధానం చేసుకునేలా వివిధ యాప్‌లు వీలు కల్పిస్తున్నాయి. తాజాగా ఊపిరితిత్తుల పనితీరును పర్యవేక్షించే స్మార్టు షర్టులను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఉచ్చ్వాస, నిశ్వాస సమయాల్లో ఛాతీ, ఉదరభాగంలో కలిగే మార్పులను అంచనా వేసి ఏదైనా సమస్య ఉంటే వెంటనే మనల్ని అప్రమత్తం చేసేలా ఇది పనిచేస్తుంది. 'హెక్సోస్కిన్'గా పిలువబడే ఈ షర్టు ద్వారా గుండె పనితీరును కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన రెడ్‌బౌడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకులు.. స్మార్టు షర్టులను, మొబైల్ యాప్‌తో అనుసంధానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు.
ఈ విషయం గురించి యూనివర్సిటీకి చెందిన డెనిస్ మానే మాట్లడుతూ..' స్మార్టు షర్టులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అవి కేవలం క్రీడాకారుల వంటి కొన్ని ఎంపిక చేసిన కేటగిరీలకు చెందిన వారు మాత్రమే ఉపయోగిస్తున్నారు. వీటిని సాధారణ జీవితంలో భాగం చేయడం ద్వారా ఊపిరితిత్తుల పనితీరును తెలుసుకునేందుకే మేము స్మార్టు షర్టులను మొబైల్ యాప్‌తో అనుసంధానం చేసి ప్రయోగాలు నిర్వహించాము అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీఓపీడీ)తో బాధ పడుతున్న 64 మిలియన్ల రోగులకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాగా స్మార్టుషర్టును ధరించిన ఒక వ్యక్తి గాలి పీల్చినపుడు అతడి ఛాతీ ఎంతమేర వ్యాపిస్తోంది.. గాలి వదిలినపుడు ఎంత లోపలికి వెళ్తుందీ అన్న విషయాలను ఇది నోట్ చేస్తుంది. ఇక ఇప్పటివరకు 15 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లను రోజంతా స్మార్టు షర్టు ధరించమని చెప్పిన శాస్త్రవేత్తలు.. వారి ఉచ్చ్వాస, నిశ్వాసలను పరిశీలించారు. కేవలం కాగా వీటిని సాధారణ దుస్తుల లోపల ధరించడం ద్వారా ఎల్లవేళలా ఆరోగ్య స్పృహతో ఉండవచ్చని మెనీ సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..