మన్మోహన్‌కు పాకిస్థాన్ ఆహ్వానం! మరి మోడీ?
- October 01, 2019
ఇస్లామాబాద్: నవంబర్‌లో జరిగే కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవ వేడుకకు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మూద్ ఖురేషి చెప్పారు. పంజాబ్ రాష్ట్రం గురుదాస్‌పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మందిరంతో కర్తాపూర్ కారిడార్ అనుసంధానం అవుతున్నది. ఎలాంటి వీసాలు లేకుండానే ఇక్కడికి భారతీయ పర్యాటకులకు పాకిస్థాన్ అనుమతిస్తున్నది. గతంలో రెండు ప్రభుత్వాల మధ్య ఈ మేరకు జరిగిన చర్చలు ఫలించాయి. భారతీయ సిక్కు పర్యాటకుల కోసం నవంబర్ 9వ తేదీన కర్తాపూర్ కారిడార్‌ను పాక్ ప్రారంభిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇస్లామాబాద్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ వేడుకకు మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించడం సముచిత గౌరవంగా భావిస్తున్నామని, త్వరలోనే ఆయనకు ఆహ్వాన లేఖను పంపుతామని ఖురేషి తెలిపారు. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తాపూర్‌కు సిక్కు భక్తుల రాక తమకు ఎంతో సంతోషకరమని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..