బిచ్చగాడు నిర్మాత తనయుడు హీరోగా 'వలయం'
- October 02, 2019
బిచ్చగాడు , డి 16, టిక్ టిక్ టిక్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్. ఈ బ్యానర్‌పై చదలవాడ శ్రీనివాసరావు పలు హిట్ చిత్రాలని రూపొందించారు. ఇప్పుడు ఆయన తనయుడు లక్ష్ చదలవాడ హీరోగా సినిమా చేస్తున్నారు. హిప్పీ ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. వలయం అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ఆసక్తిని కలిగిస్తుంది. ఫిబ్రవరి 2020లో సినిమా విడుదల కానుంది. చదలవాడ లక్ష్మణ్ కెరీర్ ప్రారంభంలో హీరోగా రాణించాలనుకున్నారు. ఒకట్రెండు సినిమాలు కూడా చేశారు. అయితే అవేవీ హిట్ కాకపోవడంతో లక్ష్మణ్ అలియాస్ లక్ష్ సైలెంట్‌గా ఉండిపోయాడు. తాజాగా.. మరోసారి లక్ష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!