భూమికి తిరిగిరానున్న యూఏఈ తొలి ఆస్ట్రోనాట్
- October 02, 2019
యూఏఈ తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్మన్సూరి, విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసుకుని భూమికి తిరిగిరానున్నారు. అక్టోబర్ 3 మధ్యాహ్నం 2.59 నిమిషాలకు (యూఏఈ టైమ్) హజ్జా అల్ మన్సూరి భూమికి చేరుకుంటారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అక్కడే వారం రోజులపాటు అనేక ప్రయోగాలు నిర్వహించారు హజ్జా. సోయజ్ స్పేస్ క్రాఫ్ట్‌కి సంబంధించిన మాడ్యూల్ ద్వారా హజ్జాతోపాటు ఆన్‌బోర్డ్ సభ్యులు భూమికి చేరుకుంటారు. అనంతరం వారిని హెలికాప్టర్ ద్వారా కరంగద సిటీకి తరలిస్తారు. అక్కడి నుంచి వారిని మాస్కోకి పంపిస్తారు. వైద్య పరీక్షల అనంతరం.. ఆస్ట్రోనాట్స్ తమ తమ స్వస్థలాలకు చేరుకోనున్నారని అధికారులు వివరించారు. అల్మన్సూరితోపాటు నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సీ ఓవచినిన్ భూమికి తిరిగి వస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!