హజ్జా టీమ్ భూమికి తిరిగొచ్చేందుకు సిద్ధం
- October 03, 2019_1570080782.jpg)
మరికొద్ది గంటల్లోనే హజ్జా అల్ మన్సౌరి భూమికి తిరిగి రానున్నారు. యూఏఈకి చెందిన తొలి ఆస్ట్రోనాట్ హజ్జా అల్‌మన్సౌరి, సోయుజ్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం విదితమే. అక్కడే కొద్ది రోజులపాటు వివిధ ప్రయోగాలు చేపట్టిన హజ్జా అల్ మన్సౌరితోపాటు అమెరికా ఆస్ట్రోనాట్ నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెక్సీ ఓవుచినిన్ భూమికి తిరిగి రానున్నారు. యూఏఈ సమయం ప్రకారం ఉదయం 10.30 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వీరి వాహక నౌక అన్ డాక్ అవుతుంది. కజకిస్తాన్‌లో వీరి స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి వీరిని హెలికాప్టర్‌లో తరలిస్తారు. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి యూఏఈ ఆస్ట్రోనాట్‌గా ఇప్పటికే రికార్డులకెక్కిన హజ్జా అల్ మన్సౌరి, అక్కడి నుంచి క్షేమంగా తిరిగొస్తున్న తొలి (తొలి ప్రయత్నంలోనే) యూఏఈ ఆస్ట్రోనాట్‌గానూ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఆయనకి వెల్‌కమ్ చెప్పేందుకు యూఏఈతోపాటు, ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..