దుబాయ్-హైదరాబాద్ ప్రయాణికుల వద్ద భారీగా బంగారం పట్టివేత

- October 05, 2019 , by Maagulf
దుబాయ్-హైదరాబాద్ ప్రయాణికుల వద్ద భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ అధికారుల వివరాల ప్రకారం దుబాయ్ నుంచి శంషాబాద్‌లో ల్యాండ్ అయిన ఎమిరేట్స్ విమానం నుంచి దిగిన ముగ్గురు ప్రయాణీకులు అనుమానంగా కన్పించడంతో డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని, విచారించగా.. వారి నుంచి టేప్‌తో చుట్టిన రెండు ప్యాకెట్లు లభించాయి. అందులో 42 ఫారిన్ మార్క్ కలిగిన బంగారు బిస్కెట్లు లభించాయి. బంగారం బరువు 4.9 కిలోలు. దాని విలువ కోటి 85 లక్షలు. ఈ బంగారం 99.9శాతం స్వచ్ఛత కలిగినవిగా అధికారులు తెలిపారు. కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. అనుమానితుల వద్ద బంగారం కొన్నట్లుగా గానీ, దిగుమతి చేసుకుంటున్నట్లుగా గానీ ఎలాంటి ధృవ పత్రాలు లేవు. వారు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించుకున్న అధికారులు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com