రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు

- October 07, 2019 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో 8 మందికి గాయాలు

కువైట్‌ సిటీ: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ఓ కువైటీ వ్యక్తి గాయపడ్డారు. షేక్‌ జబెర్‌ బ్రిడ్జిపై అల్‌ సుబ్బియా వైపుగా వెళ్ళే మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికుల్ని తీసుకెళుతున్న బస్సు, కారును ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా సబాహ్‌ హాస్పిటల్‌కి తరలించారు. మరో ఇద్దర్ని పారామెడిక్స్‌, జహ్రా హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com