'సీనయ్య' షూటింగ్ షురూ
- October 09, 2019
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకులు వివివినాయక్ ఇప్పుడు హీరోగా మారారు. ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన ఆయన నటుడిగా ఎలా మెప్పిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఠాగూర్' సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన వివివినాయక్ ఇప్పుడు పూర్తిగా నటుడిగా మారారు.
ఈ మూవీకి 'సీనయ్య' పేరు పెట్టగా నిన్న దసరా పండుగ కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా 'ఖైదీ నెంబర్ 150' బాక్సాఫీస్ షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో రైతులు పడుతున్న కష్టాలు..నీరు లేక పట్టణాలకు వలస వెళ్తూ ఊర్లు ఖాళీ చేస్తున్న అంశంపై తీసిన ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యింది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో ఈ మూవీపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఈ మూవీ భారీ తమిళ సినిమాల దర్శకుడు శంకర్ శిష్యుడు ఎన్. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 'దిల్' రాజు నిర్మాణంలో రూపొందుతోంది. ఇందులో పాత్ర కోసం వీవీ వినాయక్ జిమ్‌లో చెమట చిందుస్తు, బరువు కూడా బాగా తగ్గుతున్నాడట. 1980 నేపథ్యంలో కథ సాగుతుందనీ, వినాయక్ వయసుకు తగ్గట్టు పాత్ర ఉంటుందని సమాచారం. నేడు వివివినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవి షూటింగ్ కి ముహుర్తం ఫిక్స్ చేశారు. కానీ నిన్ననే ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ పాత్ర కోసం వీవీ వినాయక్ జిమ్‌లో చెమట చిందుస్తు, బరువు కూడా బాగా తగ్గుతున్నాడట.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!