కూతుళ్ల కాళ్లు కడిగి.. వారి ఆశీర్వాదం తీసుకున్న గౌతమ్ గంభీర్
- October 09, 2019మాములుగా పెళ్లి సమయంలో తండ్రి తన కూతరు కాళ్ళు కడుగుతాడు.. అయితే టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాత్రం తన చిన్నారి కూతుళ్ళ కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశాడనే డౌట్ రావొచ్చు.. ఇదంతా శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే అష్టమి కంజక్ ఆచారంలో భాగం. ఈ ఆచారం ప్రకారం పెళ్ళైనా.. కాకపోయినా.. దసరా సమయంలో తండ్రి తన కూతుళ్ళ కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిమీద జల్లుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. గౌతమ్ గంభీర్ కూడా తన ఇద్దరు కూతుళ్ల కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను గంభీర్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సర్వీస్‌కు బిల్లు ఎక్కడికి పంపాలని తన భార్య నటాషాను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు. ప్రసుత్తం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తండ్రి ప్రేమ వెలకట్టలేనిదని పలువురు నెటిజన్లు ఈ ఫొటోపై కామెంట్ చేస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు