రిషి కపూర్ 'శస్త్ర పూజ' పై మండిపడుతున్న నెటిజన్లు
- October 10, 2019
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా వైరల్ అవుతుంది. మంచి పోస్ట్ అయితే ఏ రేంజ్లో ప్రశంసిస్తారో.. చెడు పోస్ట్‌ను కూడా అదే రేంజ్లో ట్రోల్స్ చేస్తారు. మీమ్స్, ట్రోలింగ్‌ల పేరుతో తాట తీసేస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ రిషీ కపూర్ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
విజయదశమి సందర్బంగా హిందువులు ఆయుద పూజ చేస్తారు. వాహనాలకు, ఇంట్లో ముఖ్యమైన వస్తువులకు పూజలు నిర్వహిస్తారు. అయితే దసరా రోజు తన ఆయుదం అంటూ ఓపెనర్ కు రిషి కపూర్ ఆయుద పూజ చేయడంతో పాటు ఆ ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. 'ఫెస్టివ్ సీజన్ బిగిన్స్.. బాధ్యతగా వాడండి' అంటూ ఓపెనర్‌కి పసుపు కుంకుమ రాసి ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. ఇంకేముంది ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఓ రేంజ్లో తగులుకున్నారు.
'సీనియర్ నటుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు పండుగ నాడు ఇలాంటి పోస్టులు చెయ్యడమేంటి', 'ఆయుధానికీ, పరికరానికీ తేడా తెలియదా?' ఒక సెలబ్రిటీ నుంచి ఇలాంటి పోస్ట్‌ను ఊహించలేదు', అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు పండుగ రోజు ఇలాంటి పోస్ట్ లు పెట్టేందుకు కనీసం నీకు బుద్ది లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి కాంట్రవర్షియల్ ఫోటోలను పోస్ట్ చేయడం రిషికపూర్‌కు కొత్తేమి కాదు. గతంలో కూడా ఇలాంటివి పోస్ట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
గత ఏడాది క్యాన్సర్ బారిన పడ్డ రిషి కపూర్ అమెరికాలో దాదాపు 11 నెలల పాటు చికిత్స పొంది ఇటీవలే ఇండియాకు వచ్చాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో విహార యాత్రలో ఉన్న రిషి కపూర్ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ నటించేందుకు సిద్దం కాబోతున్నట్లుగా సమాచారం.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!