840 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం వీసీఐసీ ఏర్పాటుకు..

- January 10, 2016 , by Maagulf
840 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం వీసీఐసీ ఏర్పాటుకు..

విశాఖచెన్నై కారిడార్‌ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ ఇండియా డైరెక్టర్‌ తెరేసోఖో ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన  సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ విజన్‌ 2029 అంశంపై జరిగిన చర్చలో తెరెసో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏపీలో వీసీఐసీ ఏర్పాటుకు ఏడీబీ తరపున 840 మిలియన్‌ డాలర్ల ఆర్థికసాయం అందిస్తామన్నారు. వీసీఐసీ పరిధిలో విశాఖకాకినాడ పారిశ్రామిక నోడ్స్‌, కంకిపాడు గన్నవరం ఏర్పేడు శ్రీకాళహస్తి పారిశ్రామిక నోడ్స్‌ ఉంటాయని వెల్లడించారు. వీసీఐసీ ఏర్పాటైతే శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఏపీ పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com