అమెరికాలో బెల్లంకొండ గణేశ్ సినిమా షూటింగ్
- October 12, 2019
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ గణేశ్ (బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి విదితమే. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ ను అమెరికాలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని బీటెల్ప్రొడక్షన్స్ మరియు లక్కీమీడియా బ్యానర్ పై పవన్‌సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డేరింగ్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో అభిషేక్ నామ సురేష్‌బాబు, జెమినికిరణ్, ఎంఎల్.ఎ. జీవన్‌రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసి బెల్లంకొండ సురేష్‌కు వాళ్ళ విషెస్‌ని అందజేశారు. ఇక మరి ఈ సినిమాకి ముందుగా అందరూ చాలా మంచి టెక్నీషియన్స్ కుదిరారు.
గత 12 ఏళ్ళ నుంచి సినిమాలు చేస్తున్న బెక్కంవేణుగోపాల్. ఈ చిత్రాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నారు. బెల్లంకొండ సురేష్‌ను ఆదర్శంగా తీసుకుని బెక్కం ప్రొడ్యూసర్‌గా అయ్యానని గతంలో ఒక సారి మీడియాతో చెప్పారు. అదే విధంగా హీరోగణేష్కి కథ చెప్పగానే నచ్చి ఒప్పుకున్నాడు. వివేక్ ఈ చిత్రానికి చాలా మంచి డైలాగ్స్ అందించారు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాగానే ఇతను కూడా కష్టపడతాడా లేదా అన్నది వేచి చూడాలి. అలాగే స్క్రీన్ మీద ఎలా ఉంటాడు అతని నటనా ప్రతిభ ఏంటి అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సాయిశ్రీనివాస్ ఎంతో కష్టపడి దాదాపు ఒక పది చిత్రాల్లో నటిస్తేనే గాని మంచి పేరు రాలేదు. అలా అని తను ఎక్కడా వెనకడుగు వేయకుండా ఎంతో కష్టపడి ప్రతి సినిమా సినిమాకి తన వేరియేషన్‌ను చూపిస్తూనే ఉన్నాడు. మరి గణేష్ పరిస్థితేంటో చూడాలి.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!