అమెరికా ఇచ్చిన బంపర్ ఆఫర్...
- October 12, 2019
అమెరికాలో ఉద్యోగం చేయాలి అని ఆకాంక్షించే భారతీయ వృత్తి నిపుణులు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ టెకీలకు ఇప్పుడు ఒక కొత్త శుభవార్త చెప్తున్నారు అక్కడి ప్రభుత్వం.ఇక మీదట ఉద్యోగంలో చేరడానికి మూడు నెలలు ముందు కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును అమెరికా ఇప్పుడు వాళ్ళకు కలిపిస్తుంది. తమ దేశంలో ఎలాంటి ఉద్యోగం చేసే భారతీయులైనా కేవలం 90 రోజులు ముందుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ప్రకటించారు.
అమెరికా కంపెనీలు ప్రత్యేక సాంకేతిక నిపుణులైన విదేశీయులను ఉద్యోగులుగా నియమించుకునేందుకు, హెచ్1-బీ వీసాను వాడుకుంటుంటాయి. అమెరికా ప్రభుత్వం ఏటా జారీ చేసే 85వేల హెచ్1-బీ వీసాల్లో ఏకంగా 70 శాతం మన భారతీయులకే అందుతుండటం గమనార్హం. దీంతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ వర్క్ వీసా చాలా ప్రాముఖ్యత సంపాదిస్తూ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది అనే చెపుకోవచ్చు. అమెరికా విషయానికి వస్తే....అక్కడ ఎలాంటి అనుభవం లేని సాధారణ సాఫ్ట్ వేర్ విద్యార్థి సైతం ఏడాదికి కనీసం 60 వేల డాలర్ల ఉద్యోగం పొందగలుగుతాడు.
భారతదేశంతో పోలిస్తే అదెంతో అధికం అని చెప్పొచ్చు .ఒక్కముక్కలో చెప్పాలంటే భారత్ లో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని అక్కడ ఒక్క నెలలో సంపాదించవచ్చు అంటే అతిశయోక్తి కాదు.ఈ ప్రధాన అంశమే అందరిని అమితంగా ఆకర్షిస్తోంది. దీనికి తోడు మరెన్నో కారణాలు కూడా విదేశీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపేందుకు కారణమవుతున్నాయి. తగిన నైపుణ్యాలు,ఆర్థిక స్తోమత లేకున్నా అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు.
విదేశాలకు వెళ్ళటమే ప్రతిష్టగా తీసుకుంటున్నారు కొందరు,ఇంకొంతమంది విలాసవంతమైన జీవితం కోసం ఇలా అనేక కారణాలవల్ల హెచ్1-బీ వీసాపై మొగ్గు చూపుతున్నారు .భారత్ లోనూ ఇప్పుడు మంచి ఉద్యోగాలు,చక్కటి జీతభత్యాలు లభిస్తున్నా అది కొందరికి మాత్రమే. సాధారణ సాఫ్ట్‌వేర్ టెకీలకు వేతనాలు ఆరంభంలో 5 లక్షలకు మించడం లేదు. అందుకే నేటికీ అమెరికాకు వెళ్లే వృత్తి నిపుణులను, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ టెకీలను ఎంతోమందిని హెచ్1-బీ వీసా ఆకర్షిస్తూనే ఉంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..