గల్ఫ్ నుంచి తిరిగి వచ్చేయండని కేసీఆర్ పిలుపు
- October 12, 2019
హైదరాబాద్: గల్ఫ్‌కు వెళ్లిన తెలంగాణ బిడ్డలకు సంబంధించి విషయంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు రాష్ర్టానికి వచ్చేయాలని సీఎం పిలుపునివ్వనున్నారు. గల్ఫ్‌లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చేసుకోవడానికి బోలెడన్ని పనులున్నాయి. హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. పనికి మనుషులు దొరక్క వేరే రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటున్న పరిస్థితి ఉంది.
అందేకే పొట్ట కూటికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వారిని రాష్ట్రానికి రప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. వారికి నాక్ లో తగిన శిక్షణ ఇస్తాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ, బిల్డర్లతోనూ సంప్రదించి, నిర్మాణ రంగంలో పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డలకు స్వయంగా చెప్పడానికి నేనే అక్కడికి వెళతాను’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఎన్.ఆర్.ఐ. విధానం అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, జిఎడి ముఖ్య కార్యదర్శి ఆధార్ సిన్హాలతో కూడిన బృందం ఆదివారం కేరళ రాష్ట్రంలో పర్యటించనుంది. గల్ఫ్ దేశాల్లో పనికి పోయిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలతో త్వరలోనే సిఎం సమావేశం కానున్నారు.దీనితో పాత జిల్లాలు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండలో సగం, రెండు పంటకు నీరు అందించనున్నాం. దీంతో రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే విషయాన్ని గల్ఫ్‌లోని తెలంగాణ బడ్డలకు సీఎం స్వయంగా వివరించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..