DRDO లో ఉద్యోగాలు..టెన్త్, ఇంటర్ అర్హత
- October 13, 2019
భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-DRDO సంస్థలో ఇంటర్, టెన్త్ అర్హతతో ఉద్యోగాలున్నాయి. డీఆర్డీఓకు చెందిన సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్-CEPTAM అడ్మిన్ అండ్ అల్లైడ్ కేడర్‌లో స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం 224 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి నోటిఫికేషన్‌ను వెబ్సైట్లో చూడొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ.
పలు పోస్టుల భర్తీకి డీఆర్డీఓ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం దరఖాస్తుచేయడానికి
మొత్తం ఖాళీలు- 224 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (ఇంగ్లీష్ టైపింగ్)- 13
అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ ఏ (ఇంగ్లీష్ టైపింగ్)- 54
అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ ఏ (హిందీ టైపింగ్)- 4
స్టోర్ అసిస్టెంట్ ఏ (ఇంగ్లీష్ టైపింగ్)- 28 స్టోర్ అసిస్టెంట్ ఏ (హిందీ టైపింగ్)- 4
సెక్యూరిటీ అసిస్టెంట్ ఏ- 40
క్లర్క్ (క్యాంటీన్ మేనేజర్ గ్రేడ్-III)- 3
అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్- 29
వెహికిల్ ఆపరేటర్ ఏ- 23
ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏ- 6
ఫైర్‌మెన్- 20
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- స్టెనోగ్రాఫర్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, సెక్యూరిటీ అసిస్టెంట్, అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్ పోస్టులకు 12వ తరగతి. క్లర్క్ క్యాంటీన్ మేనేజర్, వెహికిల్ ఆపరేటర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్‌మెన్ పోస్టులకు 10వ తరగతి.
వయస్సు: గరిష్టంగా 27 ఏళ్లు. రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..