ఐసిబి టాలెంట్ ఫెస్టివల్ ఎంట్రీస్‌కి నేటితో ముగియనున్న డెడ్‌లైన్
- October 15, 2019
బహ్రెయిన్: ఇండియన్ క్లబ్ బహ్రెయిన్, చిన్నారుల కోసం నిర్వహిస్తోన్న ఐసిబి టాలెంట్ ఫెస్టివల్ 2019 ఎంట్రీస్ కోసం డెడ్‌లైన్‌ని అక్టోబర్ 15 వరకు పొడిగించగా, అది నేటితో ముగియనుంది. 2001 అక్టోబర్ 1 నుంచి 2014 అక్టోబర్ 30 మధ్య జన్మించిన చిన్నారులు ఈ టాలెంట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు అర్హులు. చిన్నారులు తప్పనిసరిగా బహ్రెయిన్ రిసెడెన్స్ పర్మిట్ కలిగి వుండాలి. అలాగే బహ్రెయిన్‌లో ఎస్టాబ్లిష్డ్ స్కూల్ స్టూడెంట్ అయి వుండాలి. కాంపిటీషన్లు నవంబర్ 2019లో జరుగుతాయి. ఆన్లైన్ ద్వారా ఎంట్రీస్ పంపేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇండియన్ క్లబ్ బహ్రెయిన్ ఈ పోటీల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. మొత్తం 126 ఈవెంట్స్ జరుగుతాయి. ఐదు ఏజ్ గ్రూప్స్‌గా విభజించి ఈ పోటీల్ని నెల రోజులపాటు నిర్వహిస్తారు. గెలుపొందినవారికి వేలాది బహుమతులు సిద్ధంగా వున్నాయి. పార్టిసిపెంట్స్ అందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..