టబ్‌లో మునిగి చిన్నారి మృతి
- October 15, 2019
యూఏఈ: పదేళ్ళ చిన్నారి హాట్ బాత్ టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. బాత్ టబ్‌లోని ఫిల్టర్‌లో చిన్నారి జుట్టు ఇరుక్కుపోవడంతో ఆమె నీట మునిగి ఊపిరి ఆడక చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తన ఇంట్లోనే వున్న హాట్ బాత్ టబ్ ఆ చిన్నారిని బలిగొనడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. బాత్ టబ్‌లోకి వెళ్ళేందుకు చిన్నారి తన తండ్రిని పర్మిషన్ అడగ్గా, ఆయన తిరస్కరించారనీ, కాస్సేపటి తర్వాత తన కుమార్తె కన్పించకపోవడంతో ఆమె కోసం వెతికిన కుటుంబ సభ్యులకు చిన్నారి విగత జీవిగా బాత్ టబ్‌లో కనిపించిందనీ ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ టీమ్ కేసు విచారణకు సంబంధించి ఆధారాల్ని సేకరించే పనిలో పడింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..