ఏ.పి ముఖ్యమంత్రిని కలిసిన అమెరికన్ కాన్సులేట్ జనరల్
- October 16, 2019అమరావతి: హైదరాబాద్‌లో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్మాన్ ముఖ్యమంత్రి వైయస్.జగన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్ కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సీఎంని తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్మాన్ వైయస్.జగన్‌తో సమావేశమయ్యారు. గ్రామ సచివాలయాలతోపాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించీ వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషిచేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనాసంస్కరణలపై రిఫ్మాన్ ప్రశంసలు కురిపించారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?