'నేత్ర' మూవీ ఫస్ట్‌లుక్ ఆవిష్కరించిన హీరో నరేష్
- October 16, 2019
బివిఎస్ఆర్ క్రియేషన్స్, మీజా ఎంటర్టైన్మెంట్స్ బేనర్స్‌పై బి.వి సుబ్బారెడ్డి నిర్మాతగా హుస్సేన్(ఎ.ఎండి) దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'నేత్ర'. లతా సంగరాజు, గీతా సింగ్, బద్రం, కేదార్‌శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌కి సిద్ధంగా ఉంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను 'మా' అధ్యక్షుడు డా. నరేష్, నటుడు శివబాలాజీ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హుస్సేన్ (ఎ.ఎండి) మాట్లాడుతూ... ''మా చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన నరేష్‌గారికి, శివబాలాజీగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 'నేత్ర' ఒక సస్పెన్స్ థ్రిల్లర్. టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. లతా సంగరాజు, గీతా సింగ్, బద్రం ఇలా ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్లో చాలా బాగా నటించారు. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది.
రఘునాథన్ సినిమాటోగ్రఫి, రాజ్‌కిరణ్ మ్యూజిక్ సినిమాకు మంచి అసెట్ అయ్యాయి. మా నిర్మాత సుబ్బారెడ్డిగారు సినిమాపై ఎంతో ఫ్యాషన్‌తో మాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాం. త్వరలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం'' అన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!