'దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌' రేపే ప్రారంభం

- October 17, 2019 , by Maagulf
'దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌' రేపే ప్రారంభం

దుబాయ్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ మూడో ఎడిషన్‌ రేపే ప్రారంభం కాబోతోంది. అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 16 వరకు ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ జరుగుతుంది. నగరం అంతటా నివాసితులు, సందర్శకులు పబ్లిక్‌గా జిమ్‌ చేస్తూ కన్పించనున్నారు. పలు రకాలైన ఈవెంట్స్‌ ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌లో భాగం కానున్నాయి. ఫెస్టివల్‌ సిటీ మాల్‌ దగ్గర రెండు ఫ్లాగ్‌ షిప్‌ ఫిట్‌నెస్‌ విలేజెస్‌ అలాగే నైట్‌ బీచ్‌.. ఇలా చాలా ఆకర్షణలు ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ సందర్భంగా ఔత్సాహికుల్ని అలరించనున్నాయి. సిటీ వ్యాప్తంగా 40 ఫిట్‌నెస్‌ ఈవెంట్స్‌, 5,000కి పైగా ఫిట్‌నెస్‌ మరియు హెల్త్‌ ప్రోగ్రామ్స్‌ జరుగుతాయి. 'సిటీ ఈజ్‌ ఎ జిమ్‌', 'ఫైండ్‌ యు 30' వంటి ఆకర్షణలు ఈ ఫెస్టివల్‌లో భాగం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసేలా అందర్నీ ఉత్సాహపరచడం ఈ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ లక్ష్యం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com