చంద్రుడి ఉపరితలంపై పెరిగిన వెలుతురు
- October 17, 2019
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కలల ప్రాజెక్టు చంద్రయాన్2కి చెందిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆ సంస్థకు చెందిన లూనార్ రికనయిసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) చంద్రుడి దక్షిణ ద్రువానికి సంబంధించిన పలు చిత్రాలను తీసింది. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నామని, విక్రమ్ కు ఏం జరిగిదన్న వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఎల్ఆర్వో ప్రాజెక్టు శాస్త్రవేత్త నోహా పెట్రో వెల్లడించారు. మూడు రోజుల క్రితం చంద్రుడి ఉపరితలంపై వెలుతురు పెరిగిందని ఆయన చెప్పారు. గత నెలతో పోలిస్తే దక్షిణ ద్రువ ప్రాంతంలో నీడ తగ్గిందని ఆయన వివరించారు.
గత నెల 17న కూడా దక్షిణ ద్రువం నుంచి ఎల్ఆర్‌వో వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, అక్కడ వెలుతురు లేని కారణంగా విక్రమ్ ఆచూకీని తెలియరాలేదు. కాగా, విక్రమ్ ల్యాండర్‌ను గతనెల 7వ తేదీ తెల్లవారుజామున ఇస్రో దక్షిణ ధ్రువంపై దించే కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయపుటంచులవరకు చేరుకొని చంద్రుడిపైకి అడుగుపెడుతుందన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ తెగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..