స్పైస్ జెట్ విమానాన్ని రౌండప్ చేసిన పాక్ యుద్ధ విమానాలు
- October 17, 2019
బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దాడుల తర్వాత పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసి, మళ్ళీ జులై 16న తిరిగి ఓపెన్ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్తున్న స్పైస్ జెట్‌ను ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ విమానంగా భావించి పాక్ యుద్ధ విమానాలు వెంబడించిన ఘటన సెప్టెంబరు నెలలో చోటు చేసుకోగా అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
120 మంది ప్రయాణీకులతో ఎస్జీ-21 స్పైస్ జెట్ ఢిల్లీ నుంచి కాబూల్‌కు సెప్టెంబరు 23న బయలుదేరింది. ఇది పాకిస్థాన్ గగనతలంపై నుంచి వెళ్తుండగా పాక్ సైన్యానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు హఠాత్తుగా అడ్డుకున్నాయి. పాక్ వాయుసేనకు చెందని ఎఫ్-16 యుద్ధ విమానాలు ఆ స్పైస్ జెట్ విమానాన్ని చుట్టుముట్టాయి. ఎత్తు తగ్గించాల్సిందిగా స్పైస్ జెట్ పైలెట్ కు ఓ పాక్ ఫైటర్ పైలెట్ చేతితో సంజ్ఞలు చేసి ఆపై పైలెట్ తో రేడియో ద్వారా సంభాషించి అది ప్రయాణికుల విమానం అని పాక్ పైలెట్లు తెలుసుకున్నారు.
అయినా సరే ఆ విమానం పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులు దాటిన తర్వాతే పాక్ విమానాలు వెనుదిరిగాయి. ఉన్నట్టుండి గాల్లో యుద్ధ విమానాలు రౌండప్ చేయడంతో స్పైస్ జెట్ ప్రయాణికులు బెంబేలు ఎత్తినట్టు సమాచారం. విమానం కాబూల్ చేరిన తర్వాత తిరుగు ప్రయాణం ఐదు గంటలు ఆలస్యమైంది. అఫ్గన్‌లోని పాక్ రాయబార కార్యాలయం నుంచి వివరణ కోరిన తర్వాత ఢిల్లీకి విమానం తిరుగు పయనమైంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..