నిలిచిపోయిన ఏపీ బస్సు సర్వీసులు
- October 19, 2019
విజయవాడ : తెలంగాణ బంద్ నేపధ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. హైదరాబాద్, భద్రాచలం వైపు బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి తెలంగాణాకు వెళ్లే అన్ని బస్సులు ఆపేశామని డీసీటీఎం మూర్తి తెలిపారు. బంద్ వల్ల ప్రయాణికులు సంఖ్య కూడా బాగా తగ్గిందన్నారు. తెలంగాణ లో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉండటం వల్ల ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సర్వీసులు రద్దు చేశామన్నారు. వీకెండ్ కావడంతో సంస్థకు కూడా నష్టం జరిగిందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం మరోసారి తమ ఉన్నతాధికారులు సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..