అగ్ని ప్రమాదం: 120 మంది రెసిడెంట్స్‌ని ఖాళీ చేయించిన అధికారులు
- October 19, 2019
యూఏఈ: అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 120 మంది రెసిడెంట్స్ ఆ భవనాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. ఉమ్ అల్ కువైన్ సివిల్ డిఫెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం అల్ రావ్దాలోని అల్ రీమ్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించగా, ఫైర్ ఫైటర్స్ సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హానీ కలగలేదనీ, ఎవరికీ గాయాలు కూడా కాలేదని అధికారులు తెలిపారు. సివిల్ డిఫెన్స్ సిబ్బంది, 120 మంది రెసిడెంట్స్‌ని ఆ భవనం నుంచి ఖాళీ చేయించి, తాత్కాలిక అకామడేషన్‌కి తరలించారు. బిల్డింగ్ రిపెయిర్ వర్క్స్ పూర్తయ్యేవరకు తాత్కాలిక అకామడేషన్స్లోనే బాధితులు వుండాల్సి వస్తుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..