ఖతార్:కేరళ నర్సు దంపతుల ఇద్దరు చిన్నారుల మృతి.....
- October 19, 2019
దోహా: ఖతార్‌లో నర్సులుగా ఉద్యోగం చేస్తున్న భారతీయ దంపతుల ఇంట విషాదఛాయలు కమ్ముకున్నాయి. అల్లారుముద్దుగా చూసుకుంటున్న వారి ఇద్దరు చిన్నారులు ఒకే రోజు మృతిచెందారు. వీరిలో మూడున్నరేళ్ల రిదు తెల్లవారుజామున 3గంటలకు మరణించగా, ఏడు నెలల వయసున్న రిదా ఉదయం 10గంటలకు తుదిశ్వాస విడిచింది. వీరిద్దరూ కేరళలోని కోజికోడ్ కు చెందన హారిస్, షమీమా దంపతుల సంతానం.హరిస్ అబే నకాలా పబ్లిక్ హెల్త్ సెంటర్ లో నర్సు కాగా, దోహాలోని నసీమ్ అల్ రబీహ్ మెడికల్ సెంటర్లో షమీమా నర్సుగా ఉంది.చిన్నారులిద్దరూ ఫుడ్‌పాయిజనింగ్ వల్లే మృతిచెందారని వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. పిల్లలు మరణించిన హమద్ హాస్పటల్లోనే హారిస్ దంపతులు కూడా చికిత్స పొందుతున్నారని షమీమా కొలీగ్స్ తెలియజేశారు. వీరి ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని, ప్రాణాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..