పంచెకట్టులో మెరిసిన రాజమౌళి
- October 21, 2019బాహుబలి చిత్రబృందం లండన్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతుంది. ఇప్పటి వరకు ఈ హాల్ లో అన్నీ ఇంగ్లీష్ చిత్రాలే ప్రదర్శింపబడ్డాయి. మొట్ట మొదటిసారి ఒక ఇంగ్లీషేతర చిత్రమైన బాహుబలి ఈ హాల్ లో ప్రదర్శింపబడటం రికార్డు.
ఈ హాల్ లో రాజమౌళి సాంప్రదాయ పంచె కట్టులో మెరిశాడు. భుజం మీద కండువాతో కనిపించి కనువిందు చేశాడు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఆ ప్రపంచ వేదికపై తెలుగు సాంప్రదాయాన్ని కూడా పరిచయం చేశాడు. మొత్తానికి బాహుబలి సినిమాతో వహ్వా అనిపించిన రాజమౌళి పంచెకట్టుతో వారెవా అనిపించాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గతి మారిపోయింది. బాలీవుడ్ వాళ్ళు సైతం అంత బడ్జెట్ కి భయపడి సినిమా తీయలేని రోజుల్లో మన తెలుగు సినిమాని శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?