`భారతీయుడు 2` లో కమల్ లుక్ లీక్
- October 24, 2019స్టార్ డైరెక్టర్ శంకర్ తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తాను చేస్తున్న సినిమా కి సంబంధించి ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సెట్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు రాకుండా చాలా పకడ్భందీగా షూట్ చేస్తాడు. కానీ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాకి కూడా లీక్ బెడద తప్పలేదు.
అతను తీస్తున్న `భారతీయుడు 2` నుంచి ఒక ఫోటో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. కీలకమైన ఆ ఫోటో ఆన్ లొకేషన్ నుంచి ఓ లుక్ లీకైపోయింది. సెల్ ఫాలెన్ నుంచి ఎవరో తీసినట్టు అర్ధం అవుతుంది. కమల్ హాసన్ సేనాపతి గెటప్ లో ఓ గుర్రంపై వెళుతున్నారు. అది కూడా మార్కెట్ వీధుల్లో గుర్రంపై కూచుని టీవీగా స్వారీ చేస్తున్నాడు సేనాపతి. ఇందులో కమల్ 90 ఏళ్ళ వృద్దుడి పాత్రలో కనిపించనున్నాడు. మొదటి పార్ట్ లో 70 ఏళ్ళ సేనాపతిగా కనిపిస్తే ఇప్పుడు 90 ఏళ్ళ సేనాపతి గా కనిపించనున్నాడు అని ఆ ఫోటో చూస్తే అర్ధం అవుతుంది. లీకెడ్ ఫోటోనే అలా ఉంటే ఇంకా ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటుందో? అసలు కమల్ హాసన్ ముసలోడి పాత్రలో ఎలా ఉంటాడో అని ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..