ఉత్తర ఆర్మీ కమాండర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్
- October 24, 2019
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పూంచ్ జిల్లాలోని బీడర్ ఏరియాలో ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ క్రాష్ అయినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం. రణ్ బీర్ సింగ్ తో పాటుగా మరో ఆరుగురు కూడా హెలికాఫ్టర్ లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి అందరూ సేఫ్ గా బయటపడ్డారని అధికారులు తెలిపారు.
క్రాష్ అయిన హెలికాప్టర్ ప్రదేశానికి ఆర్మీ అధికారులు హుటాహుటిన బయలుదేరారు. ప్రత్యేక చాపర్ బయలుదేరి వెళ్లారు. స్పాట్ లో సిట్యువేషన్ అంచనా వేస్తున్నారు. కమాండర్ స్థాయి అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ కావటంతో అంతా అలర్ట్ అయ్యారు. సాంకేతిక లోపం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు. హెలికాప్టర్ క్రాష్ ఘటనలో ఆర్మీ కమాండర్ తోపాటు పైలెట్ పరిస్థితిపైనా ఆరా తీస్తున్నారు. వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఆర్మీ ఉన్నతాధికారులు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..