వీసా లేకుండానే బ్రెజిల్ వెళ్లొచ్చు
- October 25, 2019చైనా పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో.. భారతీయులకు ఓ సదుపాయాన్ని ప్రకటించారు. వీసా లేకుండానే తమ దేశానికి రావచ్చని తెలిపారు. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియాకు కూడా బ్రెజిల్ ఈ సదుపాయాన్ని కల్పించింది. తాజాగా, భారత్ తో పాటు చైనాను కూడా ఆయన ఈ జాబితాలో చేర్చారు. ఈ దేశాలు మాత్రం బ్రెజిల్ పౌరులకు వీసా లేకుండా వచ్చే అవకాశాన్ని కల్పించలేదు.
ఆయా దేశాల పర్యాటకులు, వ్యాపారులు వీసా లేకుండానే బ్రిజిల్ వెళ్లవచ్చు. జేర్ బోల్సొనారో గతేడాది బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో పలుసార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల అమెజాన్ అడవిలో కార్చిచ్చుపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్న ఎన్జీవోల వల్లే ఈ మంటలు చెలరేగాయన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు