అర్ధాంతరంగా ముగిసిన టిఆర్టీసీ చర్చలు
- October 26, 2019
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో యాజమాన్యం శనివారం జరిపిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. మొత్తం డిమాండ్ల పరిష్కారానికి కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టడంతో చర్చలు చివరి వరకు కొనసాగలేదు. ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు చర్చలకు వచ్చారు. ఎర్రమంజిల్లో ఉన్న ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమీషనర్ సందీప్ కుమార్ సుల్తానియా చర్చల్లో పాల్గొన్నారు. నలుగురు కార్మిక నేతలను మాత్రమే చర్చలకు అనుమతించారు. వారి ఫోన్లను అనుమతించబోమని అధికారులు చెప్పడంతో కార్మిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్లు సిచ్చాప్ చేసిన తర్వాతే చర్చలు ప్రారంభమయ్యాయి. చర్చల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. ప్రధాన డిమాండ్ ఆర్టీసీ విలీనంపై కార్మిక సంఘాల నాయకులు పట్టుబడటంతో చర్చలు అర్థాంతరంగా ముగిసినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మె 22వ రోజు కొనసాగుతోంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







