సమంత తర్వాత బామ్మగా కాజల్ అగర్వాల్
- October 29, 2019
తమిళ అగ్ర దర్శకుడు శంకర్, విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `భారతీయుడు-2`. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇటీవలే రాజమండ్రిలో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం కాజల్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. ఈ సినిమాలో కాజల్ 85 ఏళ్ల వృద్ధురాలిగా కూడా కనిపించబోతోందని సమాచారం. 90 ఏళ్ల సేనాపతి భార్యగా కనిపించనుందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రమే కాజల్ యంగ్ గా కనిపిస్తుందని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ లోనే కాజల్ యాక్షన్ సీన్స్ వస్తాయట. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!