కాగ్నిజెంట్ కాస్ట్ కట్టింగ్‌..7వేలమంది ఉద్యోగుల తొలగింపునకు గ్రీన్ సిగ్నల్

- October 31, 2019 , by Maagulf
కాగ్నిజెంట్ కాస్ట్ కట్టింగ్‌..7వేలమంది ఉద్యోగుల తొలగింపునకు గ్రీన్ సిగ్నల్

బెంగళూరు: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ కాస్ట్ కట్టింగ్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రానున్న త్రైమాసికాల్లో 7వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. అంతేకాదు కంటెంట్ మోడరేషన్ బిజినెస్‌ను కూడా మూసివేయనున్నట్లు ఆ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో మరో 6వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ లాభా నష్టాలపై జరిగిన సమీక్ష సందర్భంగా ఈ విషయాలను వెల్లడించింది.

ప్రస్తుతం ఆయా హోదాల్లో పనిచేస్తున్న మధ్య సీనియర్ ఉద్యోగులు 10వేల నుంచి 12వేల మందిని తొలగించనున్నట్లు కాగ్నిజెంట్ వెల్లడించింది. వీరిని తొలగించి వీరి స్థానంలో ఉన్న ఉద్యోగులకే శిక్షణ ఇచ్చి వీరిని ప్రస్తుతం తొలగించనున్న ఉద్యోగుల స్థానాల్లో ఉంచుతారు. అలా 5వేల మందిని నియమించనున్నారు. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 2శాతం మేరా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రారంభం అవుతుందని దాని సంఖ్య 5వేల నుంచి 7వేలు వరకు ఉంటుందని కాగ్నిజెంట్ తెలిపింది.

ఇక కంటెంట్ మోడరేషన్ బిజినెస్‌నుంచి బయటకు రావాలని భావిస్తోంది కాగ్నిజెంట్ సంస్థ. ఇప్పటి వరకు సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్‌బుక్‌కు కంటెంట్ మోడరేషన్ బిజినెస్‌ను అప్పగించింది. ఇక దానికి స్వస్తి చెప్పనున్నట్లు సమాచారం. కంటెంట్ మోడరేషన్ బిజినెస్‌పై సమీక్ష నిర్వహించిన కాగ్నిజెంట్ యాజమాన్యం దీని ద్వారా ఉద్యోగులు పనిచేసే వాతావరణం కనిపించడం లేదని ఇందుకు కారణం వారిపై ఎక్కువ ఒత్తిడి పడుతుండటంతో వారు మానసికంగా నలిగిపోతున్నారని గ్రహించింది.

ఈ క్రమంలోనే కంటెంట్ మోడరేషన్‌ బిజినెస్‌ను మూసివేయాలని సంస్థ భావిస్తోంది. కంటెంట్ మోడరేషన్ బిజినెస్ మూసివేస్తే కంపెనీ కమ్యూనికేషన్ వ్యవస్థ, మీడియా, టెక్నాలజీ శాఖలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ప్రక్రియ మొత్తం రానున్న రెండేళ్లలో పూర్తి చేస్తామని కాగ్నిజెంట్ చెబుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com