దుబాయ్ ప్రయాణికుడి కొత్త గోల్డ్ ప్లాన్...
- November 01, 2019
శంషాబాద్: విదేశాల నుంచి దొంగచాటుగా తీసుకొస్తున్న 662 గ్రాముల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులు దొంగచాటుగా బంగారం తీసుకొస్తున్నట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం దిగి బయటకు వస్తున్న ప్రయాణికులను తనిఖీ చేశారు. షేక్ పరియాజ్ అనే ప్రయాణికుడిని స్కానింగ్ చేయగా అతడి కడుపులో బంగారం ఉన్నట్లు తేలింది. పెద్ద పేగులో ప్లాస్టిక్ ట్యూబ్‌లు ఉన్నాయి. వాటిల్లో బంగారం పెట్టాడు. పసిడితోపాటు లక్ష రూపాయల విలువగల ఐఫోన్, 72 వేల బురఖాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బంగారాన్ని పేస్టుగా మార్చి చిన్న చిన్న ప్లాస్టిక్ ట్యూబుల్లో నింపి తీసుకొచ్చాడు.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







