ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు చేపలు తీసుకుంటే..
- November 01, 2019
చిన్నారులకు ఆస్తమా, శ్వాసకోశ వంటి వ్యాధులు వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే అధిక బరువు గలవారు కూడా ఆస్తమా వ్యాధికి బాధపడుతుంటారు. దాంతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా వారిని బాధిస్తుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఏం చేయాలో పరిశీలిద్దాం..
1. చేపలతో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, న్యూట్రియన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పిల్లల్లో వచ్చే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధుల నుండి కాపాడుతాయి. దాంతో పాటు కంటి చూపును మెరుగుపరుస్తాయి.
2. ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఆరునెలల పాటు చేపలతో తయారుచేసిన వంటకాలు ఆహారంగా తీసుకుంటే వ్యాధి రాదని అధ్యయంలో తెలియజేశారు. తద్వారా శరీరంలో ఎప్పటి కొలెస్ట్రాల్ చేరదని వెల్లడైంది.
3. అంతేకాకుండా వారంలో రెండుసార్లు చేపలు తీసుకోవడం వలన ఊపిరితిత్తుల్లో వచ్చే వాపు కూడా తగ్గుతుందని పరిశోధనలో స్పష్టం చేశారు. ఈ వాపు తగ్గిందంటే.. ఆస్తమా కంట్రోల్ ఉంటుంది.
4. చేపలు చిన్నారులకే కాదు పెద్దలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. చాలామంది డయాబెటిస్‌తో బాధపడుతుంటారు. ఈ వ్యాధి నుండి ఎలా బయటపడాలో తెలియక చికిత్సలు తీసుకుంటూ.. మందులు వాడుతుంటారు. ఈ మందులు వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
5. వ్యాధిని అదుపులో ఉంచడానికి చేపలు చాలా ఉపయోగపడుతాయి. కనుక ప్రతిరోజూ మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో చేపలను ఒక భాగం తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







