దుబాయ్ మిరాకిల్ గార్డెస్స్ కొత్త సీజన్ ప్రారంభం
- November 01, 2019
దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ వరుసగా ఎనిమిదోసారి నేడు ప్రారంభం కాబోతోంది. హార్ట్ ఆఫ్ దుబాయ్ ల్యాండ్‌లో 72,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ గార్డెన్ ఏర్పాటయ్యింది. 50 మిలియన్లకు పైగా ఫ్లవర్స్ ఇక్కడ చూపరుల్ని ఆకర్షించనున్నాయి. ఇందులో 120 వెరైటీస్‌ని పొందుపరిచారు. 400 మీటర్ల వాకింగ్ ట్రాక్, లైఫ్ సైజ్ యానిమల్స్‌కి సంబంధించి త్రీడీ షేప్స్, యాంఫీ థియేటర్ వంటివి ఇక్కడ సందర్శకుల్ని అలరించనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మిరాకిల్ గార్డెన్‌లోకి సందర్శకుల్ని అనుమతిస్తారు సాధారణ రోజుల్లో. వారాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ పార్క్ సందర్శకులతో కిటకిటలాడనుంది. పెద్దలకు 55 దిర్హామ్‌లు, పిల్లలకు (12 ఏళ్ళలోపు) 40 దిర్హామ్‌లు వసూలు చేస్తారు. 3 ఏళ్ళలోపు చిన్న పిల్లలకు అలాగే పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కి ఉచిత ప్రవేశం.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..