స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ రిటైర్మెంట్
- January 12, 2016
తెలుగు సినీ పరిశ్రమలో కొందరు సెలబ్రిటీస్ ఒక్కొక్కరు తమ రిటైర్మెంట్‌ను ప్రకటిస్తుండగా, తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ చేరారు. బాహుబలి చిత్రం తర్వాత తన రిటైర్మెంట్ ఉంటుందని ఇటీవలే కీరవాణి తెలియజేయగా, తాజాగా స్రవంతి రవి కిషోర్ తీసుకున్న నిర్ణయం పలువురు సినీ అభిమానులను కలవరపరుస్తోంది.స్రవంతి రవికిషోర్ తన బ్యానర్‌లో అద్బుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఈ బ్యానర్‌లో నేను శైలజ చిత్రం తాజాగా విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ చిత్రంలో రామ్, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించగా నేను శైలజ చిత్రం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ చిత్రమే తనకు నిర్మాతగా చివరి చిత్రమని, ఇటీవల జరిగిన నేను శైలజ సక్సెస్ మీట్‌లో తెలిపారు రవికిషోర్.స్రవంతి రవికిషోర్ తాను నిర్మాణ రంగానికి దూరంగా ఉన్న తన బ్యానర్ మాత్రం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు . రామ్ సోదరుడు కృష్ణ చైతన్య స్రవంతి బ్యానర్‌కు ఫ్యూచర్ భాద్యతలను తీసుకోనున్నట్టు రవికిషోర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే రామ్ త్వరలో కిషోర్ తిరుమలతో మరో చిత్రం చేయనుండగా, ఈ సినిమాతోనే కృష్ణ చైతన్య నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగు పెట్టనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







